How to make as full functional computer
How to make Android full functionality computer
-
Andromium OS యాప్ ద్వారా సాధ్యమే..
మార్కెట్లో అందుబాటులో ఉన్న Andromium అనే ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమవుతోంది. ఈ ఆపరేటింగ్ సిస్టం మీ స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవ్వాలంటే మీ డివైస్ Snapdragon 800 అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. -
లాలీపాప్ ఆపై వర్షన్ ఫోన్‌లను..
ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ కూడా 2జీబికి మించి ఉండాలి. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై వర్షన్ ఫోన్‌లను ఈ Andromium సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌ను కంప్యూటర్‌లా మార్చేవేసే ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.. -
స్టెప్ 1
ముందుగా Andromium OS యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. -
స్టెప్ 2
యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఫోన్‌ను రీస్టార్ట్ చేయవల్సి ఉంటుంది. -
స్టెప్ 3
ఫోన్ తిరిగి ఆన్ అయి యాప్ ఓపెన్ అయిన తరువాత 'App Usage Access' ఆప్షన్‌ను ఓకే చేసి యాక్సిస్ కల్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లను యాక్సిస్ చేసుకునేందుకు యాప్ నోటిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. -
స్టెప్ 4
ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత Andromium OS యాప్ హోమ్ స్ర్కీన్ పై 'OK' బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి చూసినట్లయితే Andromium OS మీ ఫోన్‌లో రన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేసినట్లయితే Andromium OS మీ ఫోన్‌లో విజయవంతంగా లాంచ్ అవుతుంది. -
స్టెప్ 5
దీంతో మీ ఫోన్ కాస్తా కంప్యూటర్‌లా మారిపోతుంది. ఇప్పుడు మీ డివైస్‌ను మానిటర్, కీబోర్డ్ ఇంకా మౌస్‌లకు కనెక్ట్ చేసుకుని పూర్తిస్థాయి కంప్యూటింగ్‌ను ఆస్వాదించవచ్చు.
Post a Comment
Post a Comment