-->

AP Grama Volunteer Notification Apply online



గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో భాగంగా గ్రామ వాలింటర్లు, పట్టణాల్లో యువతను వార్డు వాలింటర్లగా నియమించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా వాలింటర్లకు అర్హతగా..పట్టణాల్లో అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి..గ్రామాల్లో అయితే.. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి.గిరిజన ప్రాంతాల్లో అయితే 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలిఅని కేబినెట్ నిర్ణయించింది గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల నియామకానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. దీనిపై జూన్ 30వ తేదీ వరకు విసృ్తత ప్రచారం కల్పిస్తారు. జూలై 8వ తేదీ నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టి.. పది రోజుల పాటు అంటే జూలై 18వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఆన్‌లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 23వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. మెరిట్ అభ్యర్థులకు జూలై 30వ తేదీ నుంచి మండల స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆగస్టు 7వ తేదీ నాటికివలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎంపికై న అభ్యర్థులకు మండల స్థాయిలోనే ఆగస్టు 10వ తేదీ తర్వాత రెండు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వలంటీర్లు అధికారికంగా విధుల్లో చేరేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు. కాగా, దీనిపై పూర్తిస్థాయి విధివిధానాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది.మొత్తం 4లక్షల 33వేల 126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15కు ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు. ప్రతి వాలంటీర్‌కి 5వేల వేతనం ప్రభుత్వం ఇవ్వనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతోంది.*.అర్హత :పదవ తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ పాస్ అయి ఉండాలి.*.వయస్సు :18 నుండి 39 సంవత్సరాల లోపు*.కావాల్సిన పత్రాలు:SSC సర్టిఫికెట్ or Inter సర్టిఫికెట్ or Degree సర్టిఫికెట్.

STEP 1
Open below link


Apply For Grama Volunteer
(గ్రామ వాలంటీర్ కొరకు దరఖాస్తు చేసుకోండి)

Click Here to Apply



STEP 2
:click here to apply

Registrations Starts From 24-06-2019)


*గ్రామ వాలంటీర్ల అప్లికేషన్ మొదలు అయినది:*
అప్లై చేసుకొనే పద్దతి:


*STEP 1:* ముందుగా పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి.

*STEP 2:* అర్హత ఉంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి.

*STEP 3:* తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.

*STEP 4:* తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా వీటిని అప్లోడ్ కూడా  చేయాలి.

*STEP 5:* తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.

*చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.*

Qualification:10th,inter degree
Age :18to 35 years
Application :click here to apply
Selection :one member 50families
Post: Ap grama volunteer

Also Read

Post a Comment