How to speedup android phone
How to speedup android
-
క్యాచీ ఫైల్స్ క్లియర్
ఈ క్యాచీ ఫైల్స్ అనేవి ఇంటర్నెట్ బ్రౌజర్స్ అలానే యాప్స్ కారణంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఫోన్‌లో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్లికేషన్ మేనేజర్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఒక్కో యాప్ పై క్లిక్ చేసినట్లయితే ఆ యాప్‌కు సంబంధించిన క్యాచీ మెమరీ కనిపిస్తుంది. క్లియర్ క్యాచీ ఆప్షన్‌ను సెలక్ట్ చేయటం ద్వారా సదరు యాప్‌కుసంబంధించిన క్యాచీ ఫైల్స్ తొలిగించబడతాయి. -
వాడకంలో లేని యాప్స్ క్లియర్
ఫోన్‌లో వాడకుండా నిరుపయోగంగా వదిలేసిన యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ వేగాన్ని నిమిషాల వ్యవధిలో పెంచుకోవచ్చు. -
విడ్జెట్స్ డిలీట్
హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకున్న విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ర్యామ్ పై ఏర్పడిన ఒత్తిడి తగ్గి పనితీరు పెరిగే అవకాశముంది. -
హెవీ గ్రాఫికల్ గేమ్స్
హెవీ గ్రాఫికల్ గేమ్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయండి. ఇవి మీ ఫోన్ వేగాన్ని తగ్గిస్తాయి. -
స్పీడ్ బూస్టర్ యాప్స్
Clean Master, CCleaner, Du Speed Booster వంటి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ వేగాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. -
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చేస్తుండాలి. దీంతో మీ ఫోన్ పనివేగం మరింతగా పెరుగుతుంది. ఫోన్‌ను రీసెట్ చేయటం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. -
మల్టీటాస్కింగ్
మల్టీటాస్కింగ్, ఫోన్ ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తంది. కాబట్టి, ర్యామ్ వాడకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్‌కు ర్యామ్ అవసరం ఉంటుంది. ఒకేసారి రకరకాల యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే ర్యామ్ వేగం మందగించి మొబైల్ ప్రాసెసింగ్ నత్తనడకన సాగుతుంది. -
యానిమేషన్స్
మీ ఫోన్‌కు సంబంధించి యానిమేషన్స్ ఇంకా ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా ఫోన్ వేగం పెరుగుతుంది. -
ఆపరేటింగ్ సిస్టం
ఫోన్ నెమ్మదించటానికి అప్లికేషన్స్ లేదా ఆపరేటింగ్ సిస్టం కారణం కావొచ్చు. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న Trepn Profiler వంటి యాప్స్ ఈ ఫోన్‌కు సంబంధించి రియల్ - టైమ్ సీపీయూ లోడ్‌ను చూపుతాయి. ఫోన్‌లోని వివిధ విభాగాల పనితీరుకు సంబంధించి ఈ యాప్ చూపించే విశ్లేషణ ద్వారా సమస్య ఎక్కడో ఉందో కనిపెట్టవచ్చు. -
నెట్ వర్క్
ఎక్కువగా 3జీ నెట్ స్పీడుగా ఉంటుంది. 2జీ నెట్ వర్క్ వాడితే అది చాలా స్లో గా రన్ అవుతుంది. అందుకని మీ మొబైల్ లో 3జీ నెట్ వర్క్ సెలక్ట్ చేసుకోండి.
Post a Comment
Post a Comment